విగ్రహదత : శ్రీమతి జగలేటి లక్ష్మి శ్రీ జగలేటి నాగేశ్వరరావు , (సెక్రటరీ)
రాయల్ నగర్ ,అనంతపురం.
రాయల్ నగర్ ,అనంతపురం.
గమనిక : అనంతపురం జిల్లాలోని ఈడిగ కులస్థుల అభివృద్ధి కోసం జిల్లా కేంద్రం లో మన కుల దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నిర్మాణం మరియు మన కులస్థుల పిల్లలకు ఉచిత హాస్టల్ భవనము ,మన చిరకాల కోరికల వునటువంటి కళ్యాణ మండపాన్ని నిర్మించటానికి శ్రీ రేణుకా యల్లమ్మ సోషియల్ మరియు ఎడ్యుకేషనల్ సొసైటీని ఏర్పాటుచేయటం జరిగినది.దాతలు ఇచిన విరాళాల ద్వార అనంతపురం లో ని రాయల్ నగర్ హై వే ప్రక్కన 39 సెంట్ల స్థలమును సేకరించి 2005 సంవత్సరం నందు సొసైటీ పేరున రిజిస్ట్రేషన్ చేయబడినది . శ్రీ రేణుకా యల్లమ్మ దేవాలయం నిర్మాణము ను ప్రారంభించి కేవలం 5 నెలలో నే 29 -04 -2012 ఆదివారం విగ్రహ ప్రతిష్ట జరపబడుచున్నది అదే రోజు కళ్యాణ మండపాన్ని , హాస్టల్ భవనమునకు భూమి పూజ కార్యక్రమునకు గౌ|| శ్రీ కె.ఇ కృష్ణ మూర్తి గారు శాసన సభ్యులు మరియు రాష్ట్ర గౌడ (ఈడిగ) సంఘం అధ్యక్షులు గారి సువర్ణ హస్తాలతో భూమి పూజ కార్యక్రము జరుగును.
ఈ కార్యక్రమములకు సహాయ సహకారాలు అందించగలరని కోరుచున్నాము .మరియు గౌడకులస్థులు అందరు సకుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ రేణుకా యల్లమ్మ కృప కు పాత్రులగుదురని ,ఈ కార్యక్రమం ను జయప్రదం చేయుదురు అని కోరుచునము ..
0 comments:
Post a Comment